పెట్రోల్‌ పోసుకుని వ్యాపారి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసుకుని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణానికి చెందిన వ్యాపారి మ్యాడం గోవర్ధన్‌ ఖాదీ ప్రతిష్టాన్‌ కార్యాలయంలో మంగళవారం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వెల్లుల్ల రోడ్‌లోని ఖాదీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఓ దుకాణం విషయమై గోవర్ధన్‌తోపాటు మరో ఇద్దరికి కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. తన పేరిట ఉన్న దుకాణాన్ని వారిద్దరు ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని గోవర్ధన్‌ ఆరోపిస్తున్నారు. ఖాదీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ వివాదం పరిష్కారం కాకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖాదీ కార్యాలయంలో దుకాణాదారులతో నిర్వహించిన సమావేశానికి హాజరైన గోవర్ధన్‌ ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడున్న వారు వెంటనే అతడిని అడ్డుకున్నారు. గోవర్ధన్‌ ఆత్మహత్యకు యత్నించడాన్ని ఖాదీ ప్రతిష్టాన్‌ మెంబర్‌ సెక్రటరీ సాంబయ్య తప్పుబట్టారు. దుకాణానికి ప్రతినెలా అద్దె కింద ఖాదీ ప్రతిష్టాన్‌కు రూ.4వేలు చెల్లిస్తున్న గోవర్ధన్‌.. రూ.12వేల అద్దెకు ఇతరులకు సబ్‌ లీజుకు ఇచ్చాడని, సదరు దుకాణం లీజు గడువు 2022లోనే ముగిసిందని, సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని పేర్కొన్నారు. కొడిమ్యాల: ధాన్యం ఆరబెట్టేందుకు ఐకేపీ కేంద్రానికి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన మండలంలోని సూరంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్‌ కథనం ప్రకారం.. గంగారంతండాకు చెందిన అజ్మీర దూరి ఉదయం ఐకేపీ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ

రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

కాజీపేట: కాజీపేట ఈఎల్‌ఎస్‌ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం రాత్రి రైల్వే ఉద్యోగి దూలం శ్రీనివాస్‌ (45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌ కొద్దిరోజులుగా విధులకు హాజరుకాకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. రామగుండంలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌పై అధికారులు క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement