కరీంనగర్ టౌన్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అక్టోబర్ 23 నుంచి 28 వరకు నిర్వహించిన 21వ అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం ఉద్భవ్– 2026లో పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. గ్రూప్ మ్యూజికల్ బ్యాండ్ విభాగంలో ప్రథమస్థానం సాధించారు. వాయిద్య సంగీతం సోలో విభాగంలో కిట్ల చరణ్ ప్రథమ, ఏవీకే క్రితిక్ ద్వితీయస్థానం సాధించారు. వివిధ దేశాలకు చెందిన సంగీత బృందాలు పాల్గొన్న ఈ పోటీల్లో పారమిత విద్యార్థులు ప్రతిభ కనబరచడంపై పాఠశాల చైర్మన్ ఇ.ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. సంగీత ఉపాధ్యాయులు జితుమణి శర్మ, కిరణ్, సాహు, సూరజ్‌ను అభినందించారు.


