రాయికల్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యువ రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని డీఏవో భాస్కర్ అన్నారు. రాయికల్ మండలం ఆలూరులో యువ రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేంద్రీయ పద్ధతిలో ఉద్యన పంటలను సాగుచేస్తే ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చన్నారు. వీటికి నీటి అవసరం తక్కువగా ఉంటుందన్నారు. అనంతరం ఇటీవల జాతీయ ఉత్తమ మహిళరైతు అవార్డు పొందిన బండారి విజయను సన్మానించారు. హర్టికల్చర్ అధికారి లత, నాబార్డ్ డీడీఎం దిలీప్, శాస్త్రవేత్త తిరుపతి, ఏవో ముక్తేశ్వర్, హెచ్‌ఈవో అన్వేష్, మాజీ సర్పంచ్ మెక్కొండ రాంరెడ్డి, యువ రైతులు రాజు, తిరుపతి, శేఖర్, ఆదిరెడ్డి, మల్లారెడ్డి, గంగారెడ్డి, సతీశ్ పాల్గొన్నారు.


