ప్రభుత్వ ధరకే బియ్యం విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ధరకే బియ్యం విక్రయించాలి

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

జగిత్యాలక్రైం: రైస్‌మిల్లర్లు, వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని హోల్‌సేల్‌, రిటైల్‌ బియ్యం దుకాణాల్లో మంగళవారం తనిఖీలు చేపట్టారు. మార్కెట్‌లో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా.. అధిక ధరలకు విక్రయించకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మోసపూరిత కొలతలపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. డిప్యూటీ తహసీల్దార్లు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement