సివిల్స్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్స్‌ పరీక్షను ఈనెల 6, 7 తేదీల్లో కొండగట్టులోని జేఎన్‌టీయూలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు షిఫ్ట్‌లో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయంలో అంతరాయం లేని ఇంటర్నెట్‌, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

ఇద్దరు జడ్జిలు బదిలీ

జగిత్యాలజోన్‌: జిల్లా రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కె.నిఖిషా రంగారెడ్డి జిల్లా పీసీఆర్‌ కోర్టు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. అలాగే ధర్మపురి జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ టి.యోగిజానకిని జగిత్యాల మొదటి అదనపు జ్యూషియల్‌ మేజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. ధర్మపురి కోర్టు జడ్జిగా ఇంకా ఎవరినీ నియమించలేదు.

విద్యార్థుల హాజరుశాతం పెంచాలి

జగిత్యాలరూరల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు పెంచేలా అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్‌ విద్యాధికారి వై.రమేశ్‌ బాబు అన్నారు. సారంగాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. అధ్యాపకులు పాఠాలు బోధించడంతోపాటు విద్యార్థులపై శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమయ్యా రు. ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

కథలాపూర్‌: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యమని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. మండలంలోని అంబారిపేట 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన 8 ఎంవీఏ సామర్థ్యం గల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించా రు. విద్యుత్‌ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఈలు మధుసూదన్‌, గంగారాం, శ్రీనివాస్‌, ఏడీఈ రఘుపతి, ఏఈ అశోక్‌, సబ్‌ ఇంజినీర్‌ భరత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ

కోరుట్లరూరల్‌: పట్టణంలోని పీవీ నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వ విద్యాలయంలో ఐకార్‌ గిరిజన ఉప ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెరటి కోళ్ల పెంపకం, ఇంటి వద్దనే దాణా తయారీపై మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 46 మంది ఎస్టీ రైతులు పాల్గొన్నారు. అనువైన కోళ్ల జాతులు, వాటి లభ్యత, పెంపకం పద్ధతులు, టీకాలు నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ, కోడిపిల్లల భ్రూడింగ్‌, స్థానికంగా లభించే ముడి సరుకు, తక్కువ ఖర్చుతో దానా తయారీ వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్‌ డీన్‌ వెంకటరమణ, రాజు, సుధీర్‌రాజు, అధ్యాపకులు శిరీష, కీర్తన, శ్రీనివాస్‌, సౌమ్య, శశాంక్‌, దివ్య, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

సునీతారాణికి మళ్లీ అవకాశం

కోరుట్ల: ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సునీతారాణి మళ్లీ నియమితులైనట్టు తెలిసింది. మూడు రోజుల క్రితం కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవటంతోపాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నర్సింగరావు సునీత సేవలు అవసరమని గుర్తించి కలెక్టర్‌కు సూచించటంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement