ఎయిడ్స్‌ నియంత్రణలో భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ నియంత్రణలో భేష్‌

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● జిల్లాకు ఐదు ప్రశంస అవార్డులు ● కలెక్టర్‌ అభినందనలు

జగిత్యాల: హెచ్‌ఐవీ నియంత్రణ, బాధితులకు మెరుగైన వైద్యసేవలు, ఏఆర్‌టీ చికిత్స, వైరల్‌ లోడ్‌ నియంత్రణలో జిల్లా ఉత్తమ ప్రతిభ కనబర్చింది. జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థల ఆధ్వర్యంలో జిల్లాకు ఐదు ప్రశంస అవార్డులు లభించాయి.

95–95–95 లక్ష్య సాధనలో ముందంజ

హెచ్‌ఐవీ నియంత్రణలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి వ్యాధి స్థితిపై అవగాహన కల్పించడం, నిర్ధారణ అయిన వారిలో 95 శాతం చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందికి వైరల్‌ లోడ్‌ నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టారు. వరుసగా మూడు నెలల పాటు మెరుగైన ఫలితాలు సాధించి జిల్లా సురక్షిత్‌ హోదాను దక్కించుకుంది.

కలెక్టర్‌కు అవార్డు.. అధికారులకు ప్రశంసలు

కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రశంస అవార్డు లభించింది. డీఎంహెచ్‌వో సుజాత, ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ప్రోగ్రాం మేనేజర్‌ సురేందర్‌, రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అవార్డులు పొందారు. డీఎంహెచ్‌వో సుజాత కలెక్టర్‌కు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి సురక్షిత్‌ ప్లస్‌ స్థాయికి పెంచాలని కలెక్టర్‌ వారికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement