6న 32వ బాలల విజ్ఞాన సదస్సు | - | Sakshi
Sakshi News home page

6న 32వ బాలల విజ్ఞాన సదస్సు

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● 136 ప్రాజెక్ట్‌లతో విద్యార్థుల ప్రతిభకు పరీక్ష ● నాలుగు ప్రాజెక్ట్‌లకు రాష్ట్రస్థాయిలో అవకాశం ● ప్రతి ప్రాజెక్ట్‌కు సంబంధించిన గైడ్‌ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో రూపొందించిన లాగ్‌బుక్‌ తప్పనిసరి ● ప్రదర్శనలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన చార్ట్‌లకు మాత్రమే అనుమతి ● ప్రాజెక్ట్‌ల అబ్జస్ట్రక్ట్‌లను ఇంగ్లిష్‌లోనే తయారుచేయాలి ● తక్కువ వయస్సున్న చిన్నారులు 250 పదాలు, ఎక్కువ వయస్సున్నవారు 300 పదాలకు మించకుండా నమోదు చేయాలి.

జగిత్యాల: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధన నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈనెల 6న 32వ జాతీయ బాలల విజ్ఞాన జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ భవనంలో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు డీఈవో రాము తెలిపారు.

ఐదు ఉప అంశాల్లో పోటీలు

సుస్థిరత కోసం విజ్ఞానం, ఆవిష్కరణలు, ప్రధాన ఇతివృత్తంగా పోటీలు నిర్వహించనున్నారు. వ్యర్థాల నిర్వహణ, శక్తి వనరులు, నీటి సేకరణ, వినియోగం, పునర్వినియోగం, సంరక్షణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిరత కోసం భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థల అనువర్తనం తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్ట్‌లు ప్రదర్శించనున్నారు.

136 ప్రాజెక్ట్‌ల పోటీ

ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎన్‌సీఎస్సీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న 136 ప్రాజెక్ట్‌లతో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఒక ప్రాజెక్ట్‌ను ఇద్దరు విద్యార్థులు ప్రదర్శించగా.. జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్ట్‌లను రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు ఎంపిక చేయనున్నారు.

విద్యార్థులకు సూచనలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement