జూనియర్‌ కళాశాలల్లో న్యాప్కిన్స్‌ | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ కళాశాలల్లో న్యాప్కిన్స్‌

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● బటన్‌ నొక్కి తీసుకునే అవకాశం ● ఇన్సినరేట్‌ మిషన్‌ ఏర్పాటు ● జిల్లాలో 16 ప్రభుత్వ కళాశాలలు ● 2,346 మంది విద్యార్థినులు

కథలాపూర్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. విద్యార్థినుల ఆరోగ్యంపై ఇంటర్‌ బోర్డు దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శానిటరీ న్యాప్కిన్‌ వెండింగ్‌, ఇన్సినరేట్‌ మిషన్లును ఏర్పాటు చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఈ మిషన్లు అమర్చినట్లు అధికారులు అంటున్నారు.

విద్యార్థినులకు సౌకర్యంగా ఉండాలని..

జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు నెలసరి సమయంలో ఇబ్బంది పడకుండా ఉండాలని శానిటరీ న్యాప్కిన్‌ వెండింగ్‌, ఇన్సినరేట్‌ మిషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వాష్‌ రూముల్లో ప్రత్యేకంగా ఈ మిషన్‌ బిగించినట్లు పేర్కొన్నారు. మిషన్‌లోని బటన్‌ నొక్కి న్యాప్కిన్లను తీసుకోవచ్చు. వినియోగించిన ప్యాడ్లను గోప్యంగా పర్యావరణహితం కోసం ఇన్సినిరేటర్‌లో పడేసి బూడిద చేయవచ్చు. మిషన్‌ వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు.

బాలికలకు ఉపయోగం

జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇందులో 2,346 మంది బాలికలు చదువుతున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు ఇంటర్‌ విద్య కోసం వచ్చే విద్యార్థినులు నెలసరి సమయంలో ఇబ్బంది పడొద్దని శానిటరీ న్యాప్కిన్‌ వెండింగ్‌, ఇన్సినరేట్‌ మిషన్‌ను జూనియర్‌ కళాశాలల్లోని వాష్‌రూముల్లో బిగించారు. ఈ మిషన్లు విద్యార్థినులకు సౌకర్యవంతంగా ఉన్నట్లు అధికారులు, అధ్యాపకులు పేర్కొంటున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

కళాశాలల్లో విద్యార్థినుల కోసం శానిటరీ న్యాప్కిన్‌ వెండింగ్‌, ఇన్సినరేట్‌ మిషన్లు బిగించాం. ఆరో గ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని ప్రభుత్వం ఈ మిషన్లు మంజూరు చేసింది. వీటి వినియోగంపై మహిళా అధ్యాపకులతో విద్యార్థినులకు అవగాహన కల్పించాం. వీటిని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలి.

– రమేశ్‌బాబు, ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement