రోడ్డు ప్రమాదాలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

జగిత్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ఎన్‌హెచ్‌, అన్ని రహదారులపై ప్రమా ద ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సుమారు 600 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయని, ప్రమాదాలు తగ్గించేలా ప్రణాళిక రూపొందించాల ని ఆదేశించారు. పోలీసు, జాతీయ రహదారుల సంస్థ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించాలన్నారు. అవసరమైనచోట్ల స్పీడ్‌ బ్రేకర్లు, హెచ్చరిక, సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, వేగ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1033కి సమాచారం అందించాలన్నారు. అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ, ఆర్డీవోలు పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాలక్రైం: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు. సైబర్‌నేరాలపై ముద్రించిన అవగాహన పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. వ్యక్తిగత వివరాలను దొంగిలించడం.. స్టాక్‌ మార్కెట్లలో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపడం వంటి మోసాలకు గురికావొద్దన్నారు. మోసపోతే వెంటనే 1930కు ఫోన్‌ చేయాలని సూచించారు. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణు, సైబర్‌ క్రైం ఎస్సై కృష్ణ, సైబర్‌ క్రైం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement