● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లి రూరల్: విద్యార్థులు శ్రద్ధతో చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్, ఆత్మకూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను మంగళవారం తనిఖీ చేశారు. విద్యాబోధన, సదుపాయాలపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. మంచి ఫలితాలు సాధించేలా శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట సర్పంచ్ రాజారాం, ఉపసర్పంచ్ లక్మ చిన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, వెంకటేశ్ ఉన్నారు.
గాయపడిన బాలుడికి పరామర్శ
కోరుట్ల: పట్టణంలోని 21వ వార్డులో ఓ బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆస్పత్రికి వెళ్లి బాలుడి పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుక్కల బెడద తగ్గించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.


