● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 15 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
సిటీ పోలీస్‌యాక్ట్ అమలు
జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 30 వరకు సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.
ముగ్గులు వేసి.. నిరసన తెలిపి..
జగిత్యాలటౌన్: సమానపనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. కలెక్టరేట్ సమీపంలోని దీక్ష ప్రాంగణం ముందు ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసిన తమను ఔట్ సోర్సింగ్‌కు మార్చడం అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహేష్, జయప్రద, సిబ్బంది పాల్గొన్నారు.
బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జగిత్యాలరూరల్: బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి హెచ్చరించారు. రైస్‌మిల్లులు హోల్‌సేల్, రిటేల్ బియ్యం వ్యాపారులు బంధనలు కతంగా పాటించాలన్నారు. అధిక ధరలకు విక్రయించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని, బ్రాండెడ్ బ్యాగుల్లో నాణ్యతలేని బియ్యాన్ని నింపి వినియోగదారులకు విక్రయించడం నేరమన్నారు. ఆయా షాపుల్లో రోజువారి నిల్వలు, ధరల బోర్డులు ప్రదర్శించాలన్నారు.
స్పైసీ సెంటర్‌లో తనిఖీలు
కోరుట్లరూరల్: కోరుట్ల మండలం కిషన్‌రావుపల్లె శివారులోని ఎస్‌ఆర్‌ఆర్ స్పైసీ సెంటర్‌లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారి అంకితారెడ్డి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష సోమవారం తనిఖీలు నిర్వహించారు. సెంటర్‌లో నిల్వ చేసిన రూ.3.5 లక్షల విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సెంటర్ లైసెన్స్, తదితర అనుమతులను పరిశీలించారు. ఆహారపదార్థాల శాంపిల్స్ సేకరించారు.
జగిత్యాలలో...
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఓ బేకరిలో ఫుడ్‌సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. లేబుల్స్ లేని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
కోరుట్లలో వర్షం
కోరుట్ల: కోరుట్ల, మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రజలు కొంత హైరానా పడ్డారు. పొలాలు కోతకు వచ్చిన సమయంలో వర్షం కురవడంతో ఇబ్బంది అవుతుందని రైతులు ఆందోళన చెందారు. పది నిమిషాలే కురవడంతో ఊపిరిపీల్చుకున్నారు.


