టీజీఐపాస్‌ దరఖాస్తులు పరిశీలించాలి | - | Sakshi
Sakshi News home page

టీజీఐపాస్‌ దరఖాస్తులు పరిశీలించాలి

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

జగిత్యాల: పరిశ్రమల స్థాపనకు టీజీఐపాస్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించాలని, అనుమతులు పెండింగ్‌లో ఉంచవద్దని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. పరిశ్రమల శాఖ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు సకాలంలో అందించాలన్నారు. టీప్రైడ్‌ పథకం కింద నలుగురు లబ్ధిదారులకు రూ.37.33 లక్షల రాయితీ మంజూరు చేశామన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ మధులత, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అనిల్‌కుమార్‌, లీడ్‌ మేనేజర్‌ రాంకుమార్‌, ఆర్టీవో మహ్మద్‌ సందాని, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారి సుజాత పాల్గొన్నారు.

విద్యార్థికి అభినందన

పీఎంశ్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంట్‌లో ధరూర్‌ క్యాంప్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థి హిమజ ప్రతిభ కనబర్చి ద్వితీయస్థానంలో నిలవగా కలెక్టర్‌ అభినందించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దినేశ్‌, డీఈవో రాము, అమర్‌నాథ్‌రెడ్డి, ప్రవీణ్‌, శ్రీదేవి, గంగయ్య, అనూజ, మనోహర్‌ పాల్గొన్నారు.

6న మల్టీపర్పస్‌ వర్కర్లకు రాత పరీక్షలు

ఆయుష్‌ విభాగంలో మల్టీపర్పస్‌ వర్కర్ల పోస్టులకు ఈనెల 6న రాత పరీక్ష ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని రూమ్‌ నంబరు 38లో పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు 15 నిమిషాల ముందు హాజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement