జగిత్యాల ఐఎంఏకు రాష్ట్రస్థాయి అవార్డు | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల ఐఎంఏకు రాష్ట్రస్థాయి అవార్డు

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

● ఉత్తమ అధ్యక్ష, కార్యదర్శులుగా హేమంత్‌, ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి

● ఉత్తమ అధ్యక్ష, కార్యదర్శులుగా హేమంత్‌, ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి

జగిత్యాల: వైద్యసేవలు, ఆరోగ్య అవగాహన, ప్రజారోగ్య కార్యక్రమాలు, వైద్యుల వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా విశేష కృషి చేసినందుకుగాను జగిత్యాల ఐఎంఏకు రాష్ట్రస్థాయిలో అవార్డులు లభించాయి. ఉత్తమ అధ్యక్ష, కార్యదర్శులుగా హేమంత్‌, ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి అవార్డులు అందుకున్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన పదో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఐఎంఏ రాష్ట్ర ప్రతినిధులు వీరికి అవార్డులు అందించారు.

జాతీయస్థాయి పోటీలకు మోడల్‌స్కూల్‌ విద్యార్థి

వెల్గటూర్‌: మండలంలోని కుమ్మరిపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని చీకటి రమ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై ంది. మోడల్‌స్కూల్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య సోమవారం నిర్మల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. త్వరలో పంజాబ్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై ప్రిన్సిపాల్‌ సందీప్‌రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఫిజికల్‌ డైరెక్టర్‌ గంగాధర్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి, ప్రోత్సాహం వల్లనే తాను విజయం సాధించినట్లు రమ్య తెలిపారు.

అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి

మల్యాల: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని డీఈవో రాము అన్నారు. మండలంలోని ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన చేపట్టాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఎంఈవో నీలగిరి జయసింహారావు, హెచ్‌ఎం శంకర్‌, సర్పంచ్‌ లత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement