జగిత్యాల: కోట్పా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. తన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేస్తే జరిమానా విధించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వందశాతం టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌గా తీర్చిదిద్దాలన్నారు. పొగాకుతో కేన్సర్, గుండెజబ్బులు, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, సీఐ కరుణాకర్, డీడబ్ల్యూవో భాస్కర్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, వ్యవసాయాధికారి భాస్కర్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష పాల్గొన్నారు.


