మోతె చెరువును సుందరీకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

మోతె చెరువును సుందరీకరిస్తాం

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

● నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌

జగిత్యాలరూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిల్లాకేంద్రంలోని మోతె చెరువును సుందరీకరిస్తామని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పనుల కోసం అమృత 2.0లో కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. ఆర్నెళ్లు గడుస్తున్నా పనులు ముందుకుసాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేయని ఎమ్మెల్యే సంజయ్‌ శంకుస్థాపన ఎందుకు చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకొస్తామన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్‌రావు, పట్టణ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేముల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు నిమ్మల నాగరాజు, గట్టిపెల్లి మానస, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు. ముందుగా బీర్‌పూర్‌ మండలం కండ్లపల్లి నుంచి మంగేళ పెద్దమ్మ గుడి, పెద్దమ్మ గుడి నుంచి రంగసాగర్‌ వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్‌, బీర్‌పూర్‌ మండల అధ్యక్షుడు ఆడెపు నర్సయ్య, జిల్లా కార్యదర్శి పాత రమేశ్‌ వినతిపత్రం సమర్పించారు.

ఈపీఎఫ్‌వో కార్యాలయం ఏర్పాటు చేయండి

జగిత్యాలటౌన్‌: జిల్లా కేంద్రంలో ఈపీఎఫ్‌వో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కార్మిక సెల్‌ నాయకులు ఎంపీని కోరారు. ఈపీఎఫ్‌వో రీజనల్‌ కార్యాలయాలు కరీంనగర్‌, నిజామాబాద్‌లో ఉండటంతో డెత్‌, జెన్యునిటీ సర్టిఫికెట్‌ వంటి అవసరాలకు కార్మికులు వ్యయప్రయాసలకు గురవుతున్నారని కట్ట విజయ్‌, బండారి ప్రభాకర్‌, బండారి గంగారెడ్డి, హన్మాండ్లు, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement