పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

పట్టింపేది?

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

● డివైడర్లలో ఎండిపోతున్న మొక్కలు ● కళాహీనంగా జంక్షన్లు

పచ్చదనంపై

జగిత్యాల: పట్టణంలో డివైడర్లు, జంక్షన్ల సుందరీకరణ, పచ్చదనం కోసం బల్దియా ఆధ్వర్యంలో హరితహారం పథకం కింద మొక్కలు నాటారు. కాగా, వాటి సంరక్షణ మర్చిపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. మున్సిపాలిటీలో గ్రీన్‌ బడ్జెట్‌ కింద లక్షలాది రూపాయలు కేటాయిస్తున్నారు. ఇటీవలే వన మహోత్సవం పేరిట లక్ష మొక్కల కొనుగోలుకు టెండర్లు పిలిచి పట్టణంలో పంపిణీ చేశామని చెబుతుండగా, అవి ఎక్కడా కన్పించడం లేదు. అసలు మొక్కలు పంపిణీ చేసిన దాఖలాలు లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కళాహీనంగా జంక్షన్లు

జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌ వద్ద జంక్షన్లు ఉన్నా వాటిలో గ్రాస్‌ లేక, ఫౌంటేయిన్‌ పనిచేయక అందులో చెట్లు ఎండిపోయే స్థితికి చేరి కళాహీనంగా మారాయి. జంక్షన్లలోని చెట్లు, మొక్కలకు రోజూ ట్రాక్టర్ల ద్వారా నీరు అందించాలి. కానీ, వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నీరు లేక బల్దియాలోని నర్సరీల్లో మొక్కలు ఎండిపోతున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక మొక్కలను ఎలా పెంచుతారో, టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదని పలువురు బహిరంగంగానే చర్చిస్తున్నారు. కాగా, మొక్కల మెయింటనెన్స్‌ కింద రూ.50 లక్షల వరకు ఖర్చులు చూపుతున్నారని, వాటి వినియోగంలో అవకతవకలు జరిగాయని, విచారణ చేపట్టాలని మాజీ కౌన్సిలర్‌ జయశ్రీ ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement