రాయికల్: మత్స్య కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నగదు రూపంలో ఆర్థిక సహాయం అందించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మండలంలోని కుమ్మరిపల్లికి చెందిన మత్స్య కార్మిక కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. గత ప్రభుత్వంలో మత్స్యకార్మికులను ఆదుకునేందుకు చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసిందని, ప్రస్తుతం పిల్లల పంపిణీ నిలిచిపోవడంతో మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై, ఆగస్టులో చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉందని, ఇప్పటికీ ప్రక్రియ ముందుకు కదలకపోవడంతో వారంతా ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి చేపపిల్లలు కాకుండా నగదు రూపంలో సహాయం అందించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, నాయకులు గుమ్మడి సంతోష్, తిరుపతిరెడ్డి, బర్కం మల్లేశ్‌యాదవ్, మహిపాల్‌రెడ్డి, గోపి రాజిరెడ్డి, భూమయ్య పాల్గొన్నారు.
నేడు లక్ష్మీపూర్‌లో తృతీయ గిరి ప్రదక్షిణ
జగిత్యాలజోన్: పౌర్ణమి సందర్భంగా సోమవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ తృతీయ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అశేష భక్తుల పాదయాత్ర మధ్య శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను కొండచుట్టూ ఊరేగించనున్నారు. గిరిప్రదిక్షణకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రానుండడంతో తాగునీటి సౌకర్యం కల్పించారు. గ్రామస్తుల సహకారంతో గిరి ప్రదక్షిణకు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఆర్చకులు కూర్మచలం శరతాచార్యులు తెలిపారు.
శ్రీనివాసుల సేవా సంస్థ తృతీయ వార్షికోత్సవం
కోరుట్ల: పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తృతీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాదిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాతలకు ప్రశంసపత్రాలు అందించారు. ముందుగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీనివాస నామధేయులు తరలివచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివా సుల సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఊ ట్కూరు శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
కథలాపూర్: ప్రధాని మోదీ సూచనల మేరకు దీపావళి పండుగ సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొడిపెల్లి గోపాల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని సిరికొండలో బీజేపీ నాయకులతో కలిసి ప్రధాని నిర్వహిస్తున్న శ్రీమన్ కీ బాత్‌శ్రీ కార్యక్రమాన్ని ఆదివారం వీక్షించారు. ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్‌తరాలకు ఆరోగ్యకరమైన మార్గమన్నారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటుండటం అభినందనీయమన్నారు.


