పేద విద్యార్థులకు ‘కార్పొరేట్‌’ విద్య | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు ‘కార్పొరేట్‌’ విద్య

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

జగిత్యాలరూరల్‌/ధర్మపురి: పేదవిద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లి, మోరపల్లి శివారులో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా స్కూల్‌ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు అందించే విలువైన సంపద విద్య అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనీసం 10 ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లలో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సుమారు 2,600 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా స్కూల్‌ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు సుమారు 2,600 మంది విద్యార్థులకు విద్యనందించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూ ల్‌ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌. ప్రసూనాంబ, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దినేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నారాయణరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ దామోదర్‌రావు, నాయకులు నక్కల రవీందర్‌రెడ్డి, బాలముకుందం, కట్ట రాజేందర్‌, గంగారెడ్డి పాల్గొన్నారు.

ధర్మపురిలో బస్‌ డిపో ఏర్పాటు చేస్తాం

ధర్మపురిలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి బస్టాండ్‌ను రూ.2.57 కోట్ల వ్యయంతో ఆధునీకరించే పనులకు మంత్రి అడ్లూరితో కలిసి ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి కోరిక మేరకు డిపో ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్‌ కు సూచించారు. అడ్లూరి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం .. బస్‌డిపోతోపాటు రెవె న్యూ డివిజన్‌, సబ్‌ట్రెజరీ, రిజిస్టార్‌ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ముందుగా మంత్రులు శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బస్‌భవన్‌ కమర్షియల్‌ ఈడీ రాజశేఖర్‌, కరీంనగర్‌ ఈడీ సోలామన్‌, ఆర్‌ఎం రాజు, ఆర్‌వీఎం.బాపూరావు, డీఆర్‌ఎం భూపతిరెడ్డి, సీసీఈ కవిత, డీఎంలు రమేష్‌, హరి, మనోహర్‌, గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌.దినేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి, దేవస్థానం ఈవో శ్రీనివాస్‌ తదితరులున్నారు.

రూ.200కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement