సదర్‌మట్‌ నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

సదర్‌మట్‌ నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

కోరుట్ల: సదర్‌మట్‌ బ్యారేజీ నుంచి ఇబ్రహీంపట్నం మండలం గంగనాల ప్రాజెక్టుకు విడుదల చేసేందుకు సంబంధిత అధికారులు అంగీకరించారని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయనబీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆదివారం బ్యారేజీని సందర్శించారు. 800 క్యూసెక్కుల నీటిని గంగనాల ప్రాజెక్టుకు విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అంగీకరించారని పేర్కొన్నారు. గంగనాల నుంచి ఆయకట్టుకు నీరు విడుదల అవుతుందని, తద్వారా ఆయకట్టు రైతులకు ప్రయోజనం కలగనుందని వివరించారు. నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు గంగనాల ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement