ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

జగిత్యాలక్రైం: విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం ముందస్తు దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో ఆయుధపూజ, వాహన పూజ చేశారు. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ఏఎస్పీ చేతన్‌ నితిన్‌, డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రవికుమార్‌, సీఐలు వేణు, ఆరీఫ్‌అలీఖాన్‌, కరుణాకర్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

పొన్నచెట్టు వాహనంపై శ్రీలక్ష్మీనృసింహుడు

ధర్మపురి: శరన్నవరాత్రోత్సోవాల సందర్భంగా సోమవారం ధర్మపురిలోని యోగ, ఉగ్ర శ్రీలక్ష్మీనృసింహస్వాముల వారు పొన్నచెట్టు వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement