ధర్మపురి: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సోమవారం సిద్దిదాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి చండీహోమం, బలిహరణం, పూర్ణాహుతి చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.
శ్రీవేంకటేశ్వర ఆలయంలో కుంకుమార్చన
కోరుట్ల: పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వర ఆలయంలో సోమవారం కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారిని హనుమాన్ వాహనంపై పట్టణ వీదుల్లో ఊరేగించారు. భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, ఈవో విక్రం, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


