జగిత్యాల రూరల్ మండలంలో చెట్ల కొమ్మలతో నిండిపోయిన కాలువ
డి–53 పరిధిలోని ఓ కాలువలో చెట్ల పొదలు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వారంరోజులుగా కాలువల ద్వారా నీరు వదులుతున్నారు. ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలు, చిన్న కాలువల్లో ముళ్లపొదలు, చెట్లకొమ్మలు ఏపుగా పెరగడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం గగనంగా మారింది. కొన్ని చోట్ల నీరు రోడ్లపైకి చేరుతోంది. జగిత్యాల రూరల్, రాయికల్ మండలాల్లోని కాలువల వెంబడి ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి.


