కలెక్టర్‌ విజయదశమి శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ విజయదశమి శుభాకాంక్షలు

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

జగిత్యాల: విజయదశమి ప్రతిఒక్కరికీ విజయాలు అందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దృఢమైన సంకల్పం, పట్టుదలతో ముందుకెళ్తే విజయం తప్పక సిద్ధిస్తుందన్నారు. అనంతరం మాట్లాడుతూ.. జాతీయ ఆయుష్‌ మిషన్‌ పరిధిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మెడికల్‌ ఆఫీసర్లు, ఫార్మసిస్ట్‌, సైకాలజికల్‌ కౌన్సిలర్‌, యోగా ప్రొఫెసర్‌, మల్టీపర్పస్‌ పోస్టులు ఎనిమిది ఖాళీగా ఉన్నాయని, ఈనెల 22 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఆయుష్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ను సంప్రదించాలని సూచించారు.

దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి

జగిత్యాల: దుర్గమాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా సోమవారం దుర్గమాత మండపాలను సందర్శించారు. ఎల్‌నినో ప్రభావం తొలగిపోయి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఉన్నారు.

అమ్మవారికి జీవన్‌రెడ్డి పూజలు

జగిత్యాలరూరల్‌: జగిత్యాలరూరల్‌ మండలం వెల్దురి, పొరండ్ల గ్రామాల్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవిని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలప ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement