విజయదశమికి ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

విజయదశమికి ఏర్పాట్లు పూర్తి

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

● జగిత్యాల, మోతె ప్రజల మైత్రికి చిహ్నం జంబిగద్దె ● విజయనగరంలో తర్వాత జిల్లాకేంద్రంలోనే నిర్మాణం

ఏర్పాట్లను పరిశీలిస్తున్న జగిత్యాల చైర్‌పర్సన్‌, కమిషనర్‌, వేద పండితులు, ముస్తాబైన జంబిగద్దె

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని జంబిగద్దెకు ప్రత్యేక స్థానం ఉంది. జగిత్యాల, మోతె ప్రజలు ఎళ్లప్పుడు స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో పట్టణంలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ జంబిగద్దెను నిర్మించారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో రాజులు జంబిగద్దెను ఏర్పాటు చేయగా.. ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఏటా విజయదశమి రోజున జంబిగద్దె వద్ద జంబిచెట్టు ఏర్పాటు చేసి కలెక్టర్‌, కమిషనర్‌, ఆర్డీవో పాల్గొని పూజ చేయడ ఆనవాయితీ. అనంతరం ప్రజలందరూ జంబి పెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. విజయదశమిని పురస్కరించుకుని జంబిగద్దెకు రంగులు వేయించారు. రంగురంగుల బల్బులతో తీర్చిదిద్దినట్లు జగిత్యాల కమిషనర్‌ సత్యప్రణవ్‌ తెలిపారు. ఈ జంబిగద్దెకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగరం తర్వాత ఇక్కడే జంబి గద్దె ఉందని ప్రముఖ వేదపండితులు వేణుగోపాలచార్య కౌశిక తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement