అమరవీరుల వారోత్సవాలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల వారోత్సవాలకు ఏర్పాట్లు

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

● ఈనెల 21 నుంచి నిర్వహణ

● ఈనెల 21 నుంచి నిర్వహణ

జగిత్యాలక్రైం: ప్రజలకు భద్రత కల్పించడంలో నిరంతరం కృషి చేసే పోలీసులు.. విధి నిర్వహణలో అమరులు అవుతున్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు పోలీసు శాఖ ఏటా పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తోంది. పోలీసు ఫ్లాగ్‌డే పేరుతో ఈనెల 21 నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఓపెన్‌హౌస్‌ ద్వారా ఆయుధాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల సేవలపై అవగాహన కల్పించనున్నారు. రక్తదాన శిబిరం, సైకిల్‌ ర్యాలీ, ఫ్లాగ్‌డే కార్యక్రమాలతో అమరులకు నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతోపా టు విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటున్నామని తెలి పారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకు ఫ్లాగ్‌డేను ఈనెల 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement