బస్సు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘాట్‌రోడ్డు వెంట వాహనాల రాకపోకలు నిషేధించారు. ఏడేళ్ల నుంచి గిరాకీ తగ్గిపోయింది. పాత ఘాట్‌రోడ్డు వెంట భక్తులు రాకపోకలు తగ్గిపోయాయి. నూతన ఘాట్‌రోడ్డు ఏర్పాటుతో భక్తుల రాకపోకలు పెరిగి, మళ్లీ ఉపాధికి భరోసా లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నాం. – గుర్రం మల్లేశం,
కొబ్బరికాయల దుకాణాదారుడు
భక్తుల భద్రతకు ప్రాధాన్యం
అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లేలా ఘాట్‌రోడ్డు వెంట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయిస్తాం. నూతన ఘాట్‌రోడ్డును ప్రమాదరహితంగా నిర్మాణం చేపడుతాం. రూ.200కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి కోమటి వెంకటరెడ్డికి భక్తుల తరఫున ధన్యవాదాలు.
– మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే


