బతుకమ్మపై ఎల్‌నినో ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

జగిత్యాలటౌన్‌: ఎల్‌నినో ప్రభావం బతుకమ్మ వేడుకలపై పడింది. జగిత్యాల పట్టణంలోని ధరూర్‌ క్యాంపులోగల శ్రీకోదండరామాలయం వెనుక వైపు నుంచి ప్రవహించే డీ–64కెనాల్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కెనాల్‌కు నీటిని వదలకపోవడంతో ఎండిపోయింది. ఈ క్రమంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా కెనాల్‌లో భారీ టార్పాలిన్‌ షీట్లు పరిచి బల్దియా ట్యాంకర్ల ద్వారా నీటిని నింపారు. ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాల్సిన బతుకమ్మలను తాత్కాలికంగా నీటిని నిల్వ చేసి.. కార్యక్రమాన్ని పూర్తి చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement