కొడిమ్యాల: తాగునీరు సరఫరా చేయాలని కోరుతూ.. మండలంలోని చెప్యాలలో 10, 11వ వార్డు ప్రజలు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. పండుగపూట నీరు లేకపోవడంతో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నీటి సరఫరా సక్రమంగా కావడం లేదంటూ పదో వార్డు సభ్యుడు నాగరాజు.. సర్పంచ్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. గతంలో నీటి సరఫరా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిపై ఫిర్యాదులు రావడంతో తొలగించామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలోనూ సమస్య ఎదురవుతోందని సర్పంచ్ తెలపగా.. నాగరాజు తన పదవి కాలం ముగిసేవరకూ వార్డులో నీటి సరఫరా సమస్య తలెత్తకుండా తానే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ప్రజలు వెనుదిరిగారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని కుర్మపెల్లి గ్రామంలో పలువురి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులు చూసి ఒర్వలేక ప్రతిపక్షపార్టీలు ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. సర్పంచ్ మల్లేష్, మాజీ సర్పంచ్ రాజమల్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి: వైద్యశిబి రాలతో వ్యాధుల ను గుర్తించి కట్టడి చేసేందుకు అవకాశముంటుందని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్, సీనియర్ ఫిజీషియన్ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆరెపెల్లిలో సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జగిత్యాలకు చెందిన దంత, చెవి, ముక్కు, గొంతు, జనరల్ మెడిసిన్, చర్మ వ్యాధుల వైద్య నిపుణులు 187 మందికి పరీక్షలు నిర్వహించారు. వడ్లూరి శ్రవణ్‌కుమార్, యెనగందుల నరేశ్, చందనరెడ్డి, రేగుంట ప్రశాంత్, రఘురామ్, సర్పంచ్ గుగ్గిల్ల మధుకర్, ఉప సర్పంచ్ జాడి రవి, రెడ్‌క్రాస్ సభ్యులు గుండ సురేశ్, బూస మల్లేశం పాల్గొన్నారు.


