కొండగట్టు ఘాట్‌రోడ్డుకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

కొండగట్టు ఘాట్‌రోడ్డుకు మోక్షం

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

● ప్రమాదాల నివారణకు నిర్ణయం ● రూ.200కోట్లు మంజూరు ● చిరువ్యాపారుల ఉపాధికి భరోసా

మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఘాట్‌రోడ్డుపై గతంలో జరిగిన బస్సు ప్రమాదం దేశ చరిత్రలోనే మరిచిపోలేని పెను విషాదమైంది. అప్పటినుంచి ఘాట్‌రోడ్డుపై భారీ వాహనాలకు నిషేధం విధించడంతో భక్తుల రాకపోకలు తగ్గిపోయి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. కొండగట్టుకు వచ్చే భక్తులు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు.. ప్రమాద రహిత రోడ్డుగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ తీసుకుని కొత్త ఘాట్‌రోడ్డు కోసం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ద్వారా రూ.200కోట్లు మంజూరు చేయించారు. ఘాట్‌ రోడ్డు పూర్తయితే తమ ఉపాధికి భరోసా లభిస్తుందని దుకాణదారులు ఎదురుచూస్తున్నారు. గతంలో మెట్లదారి వెంట కొండపై ఉన్న పోలీస్‌ రిసీవర్‌ బిల్డింగ్‌ వరకు ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఘాట్‌రోడ్డుకు దక్షిణం వైపున జలబుగ్గ సమీపం నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర వైజంక్షన్‌ వరకు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి త్వరలోనే విధానపరమైన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement