పూలను పూజించే వేడుక | - | Sakshi
Sakshi News home page

పూలను పూజించే వేడుక

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

● నేడు సద్దుల బతుకమ్మ ● గౌరవమ్మను కొలవనున్న ఆడపడుచులు ● జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి

జగిత్యాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందడి జిల్లాలో మొదలైంది. ప్రకృతిలో సహజంగా లభించే రంగురంగుల పూలను పూజించే అపురూప పండుగగా బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆడపడుచుల ఆత్మీయత, కుటుంబ బంధాలు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను వేడుకగా జరుపుకొనేందుకు పల్లెలు, పట్టణాలు సిద్ధమయ్యాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి పూలతో బతుకమ్మను పే ర్చి.. నేడు సద్దుల వేడుక నిర్వహించుకోనున్నారు.

బతుకమ్మ ఘాట్ల పరిశీలన

బతుకమ్మల నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా చూడాలని జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి అన్నారు. పట్టణంలో నిమజ్జన ఘాట్లను పరిశీలించారు. ఘాట్ల వద్ద పారిశుధ్యం, లైటింగ్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ధరూర్‌ వాగులోకి నీరు విడుదల చేయించామన్నారు. ఆమె వెంట కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, మల్లవ్వ, శానిటరి ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

ధర్మపురిలో భారీ ఏర్పాట్లు

ధర్మపురి: బతుకమ్మ వేడుకల సందర్భంగా ధర్మపురి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గోదావరి తీరం, నందీ కూడలి వద్ద ఏర్పాట్లు చేశారు. గోదావరిలో హైమస్‌ లైట్లు బిగించారు. దారులపై మట్టి పోయించారు. మంగలిగడ్డ, సంతోషిమాత పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లు చేసారు. బతుకమ్మలను గోదావరిలో వేయడానికి ప్రత్యేక బల్లకట్టును ఏర్పాటు చేసారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. సద్దుల వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నాయకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement