కనులపండువగా వెంకన్న కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా వెంకన్న కల్యాణం

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

పొన్నచెట్టు

వాహనంపై శ్రీనివాసుడు

కోరుట్ల: పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వర ఆలయంలో స్వామి వారు శనివారం పొన్న చెట్టు వాహనంపై ఊరేగారు. మహిళలు

మంగళహారతులతో

స్వా గతం పలికారు.

ఆల య అధ్యక్షుడు యతిరాజం నర్సయ్య, ఈవో విక్రమ్‌, నర్సయ్య, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఢిల్లీ బతుకమ్మ వేడుకల్లో ఆత్మకూర్‌ కళాకారులు

గొల్లపల్లి: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో మండలంలోని ఆత్మకూర్‌కు చెందిన 12 మంది ఒగ్గు కళాకారులు తెలంగాణ సంస్కృతిని చాటారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒగ్గు రవి నేతృత్వంలోని

బృందం రాజశేఖర్‌, శివకుమార్‌, మహేశ్‌ ఒగ్గు డోలు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పల్లె జానపద కళను జాతీయస్థాయిలో ప్రదర్శించే అవకాశం రావడం గర్వకారణమని కళాకారులు తెలిపారు.

రాయికల్‌: పట్టణంలోని సంఘమిత్ర యువజన సంఘం

ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గదేవి వద్ద శనివారం శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని శనివారం కనుల పండువగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు కల్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement