పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

పెగడపల్లి: మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నమోదు, పెండింగ్‌ కేసుల పరిష్కారం తీరును పరిశీలించారు. రౌ డీ షీటర్లు, నిందితుల కదలికలపై నిఘాపై ఎస్సై కుమారస్వామిని అడిగి తెలుసుకున్నా రు. దుర్గా నవరాత్రి, దసరా వేడుకలు ప్రశాంతంగా జరిగేలా భద్రత చేపట్టాలన్నారు. నైట్‌ పెట్రోలింగ్‌ పెంచాలన్నారు. గంజాయి, మద్యం రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

జగిత్యాలజోన్‌: ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత అన్నారు. జిల్లాకేంద్రంలోని స్పెషల్‌ సబ్‌ జైలును శనివారం సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితి, వారి సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై జైలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జైలర్‌ మొగిలేశు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కటుకం చంద్రమోహన్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు.

‘సూరమ్మ’ ఎడమ కాలువ భూసేకరణకు సర్వే

కథలాపూర్‌: సూరమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల కోసం సంబంధించిన భూసేకరణకు అధికారులు మండలంలోని చింతకుంట శివారులో శనివారం సర్వే చేపట్టారు. చింతకుంట శివారులో ఎడమ కాలువకు సుమారు ఎనమిది ఎకరాల భూమి అవసరం ఉంటుంది. సర్వే నంబర్లవారీగా రైతులు కోల్పోయే భూమిపై అవగాహన కల్పించారు. సర్వే పూర్తయ్యాక రైతులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ఎడమ కాలువ ద్వారా చింతకుంటలోని లక్కాకుల చెరువును నింపాలని సర్పంచులు నాగం భూమయ్య, తిరుపతినాయక్‌ కోరారు. తహసీల్దార్‌ రమేశ్‌, సర్వేయర్‌ సాయి, ఆర్‌ఐ రవీందర్‌, జీపీవోలు సుధాకర్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

మార్కెట్‌యార్డుకు మూడు రోజులు సెలవు

జగిత్యాలఅగ్రికల్చర్‌: దసరా సందర్భంగా జగిత్యాల మార్కెట్‌యార్డుకు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చైర్మన్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఈనెల 19నుంచి 21 వరకు మూసివేసి ఉంటుందని, ఈనెల 22న క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

వివాదాస్పద భూమి పరిశీలన

ఇబ్రహీంపట్నం:మండలంలోని తిమ్మాపూర్‌లో సర్వేనంబర్‌ 131, 118లో ఉన్న భూమిని శనివారం మెట్‌పల్లి ఆర్డీవో నర్సింహారావు, డీఎఫ్‌వో రవిప్రసాద్‌ పరిశీలించారు. కొంతకాలంగా రెవెన్యూ, అటవీశాఖ అధికారుల మధ్య భూ వివాదం నెలకొంది. తమది అని రెవెన్యూ అధికారులు అంటే.. తమదేనని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆ భూమి రికార్డులను పరిశీలించిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఎవరి భూమి అయితే వారికే చెందుతుందని నిర్ణయానికి వచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్‌వో తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎడీఎస్‌అండ్‌అర్‌ నాగేందర్‌, డీఐ సుదర్శన్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి చైతన్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement