జగిత్యాలటౌన్: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వి.మురళీధర్ గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో సేవాజ్యోతి యాత్రను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్, నలవాల తిరుపతి, పిల్లి శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాస్, ఓరుగంటి చంద్రశేఖర్, నారపాక అశోక్, కాశెట్టి తిరుపతి పాల్గొన్నారు.


