రాయికల్: పట్టణంలోని చెరువు వద్ద ఇటీవల ప్రభుత్వ నిధులతో ఓ కాంట్రాక్టర్ ఓపెన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేశాడు. అయితే అవి ప్రారంభానికి ముందే ధ్వంసమవుతున్నాయి. పలువురు జిమ్ పరికరాలను ఎత్తుకెళ్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రజలకు ఉల్లాసం కలిగించేందుకు పట్టణంలో పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ. కోటి నిధులు విడుదల చేసింది. 2025 సెప్టెంబర్ 19న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చిల్డ్రన్ పార్క్, ఓపె న్ జిమ్‌కు శంకుస్థాపన చేశారు. ఏడాది గడిచినా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.
ఏడాది నుంచి నత్తనడకన..
పట్టణంలోని పెద్ద చెరువు వద్ద 30 గుంటల స్థలంలో రూ.కోటి నిధులతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, హైమాస్ట్ లైట్లు, గ్రీనరీలకు నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన తర్వాత టెండర్పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కేవలం ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేసి పత్తాలేకుండాపోయారు. ఏడాది గడుస్తున్నా కాంట్రాక్టర్ పనుల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
ప్రారంభానికి ముందే..
ఓపెన్ జిమ్‌లో కాంట్రాక్టర్ రూ.10 లక్షలతో జిమ్ పరికరాలు ఏర్పాటు చేసి చిన్నపిల్లలు ఆడుకునేలా ఊయలలు, ఇతర సామగ్రి బిగించి వెళ్లిపోయారు. ఇందుకు రూ.10 లక్షలు బిల్లు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓపెన్ జిమ్ ప్రారంభం కాకముందే సామగ్రి ధ్వంసం కావడంతోపాటు పలు వురు వస్తువులను దొంగిలించినా కాంట్రాక్టర్ మా త్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిల్డ్రన్ పార్క్ హై మాస్ట్ లైట్లు గ్రీనరీ ఏర్పాటు చేయకపోవడంతో పా టు, వాకింగ్ ట్రాక్ కోసం ఏర్పాటు చేసిన పనులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్ స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేలా చూడాలని బల్దియా ప్రజలు కోరుతున్నారు.
ముందుకు సాగని వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులు
చోరీకి గురైన జిమ్ పరికరాలు


