ఊపిరి ఆడనివ్వని కరీంనగర్ డంప్‌యార్డు
ఎయిర్ పోర్టు ఏర్పాటుపై నీలినీడలు
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించాలి
మధ్యమా‘నీరు’.. ఎగువ మానేరు చేరాలి
వేములవాడ అభివృద్ధిపై ఆశలు
ఎక్కడికక్కడే సిరిసిల్ల మరమగ్గాలు
సీఎం హోదాలో నేడు తొలిసారి ఉమ్మడి జిల్లాకు రేవంత్‌రెడ్డి రాక
7
గరిష్టం/కనిష్టం
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉంది.
సీఎం సారు..
దృష్టిపెట్టాలి మీరు
కొండగట్టులో మాజీ ఎంపీ హనుమంతరావు పూజలు
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారిని మాజీ ఎంపీ, రాష్ట్ర బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారులు వి.హనుమంతరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. హనుమంతరావు వెంట ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, ఆలయ పరిశీలకులు అశోక్ ఉన్నారు.
జేఎన్‌టీయూను వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలి
కరీంనగర్: జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో జీవన్‌రెడ్డి మంగళవారం సీఎంకు లేఖరాశారు. ఉత్తర తెలంగాణ విద్యార్థులకు సాంకేతిక విద్య, ఆధునాతన కోర్సులు, పరిశోధన, స్టార్టప్ అవకాశాలు అందుబాటులోకి రావాలంటే కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2006లో నాచుపల్లి శివారులో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటైన ఈ కళాశాలలో ఏటా సుమారు 1,500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అధునాతన ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీ, హాస్టల్ సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యాబోధన, క్యాంపస్ ప్లేస్‌మెంట్లతో కళాశాల మంచి గుర్తింపు పొందిందన్నారు. ప్రస్తుతం కళాశాల పరిధిలో సుమారు 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జేఎన్‌టీయూను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో ఉత్తర తెలంగాణలోని పలుజిల్లాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన సీఎంను కోరారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అల్లీపూర్ విద్యార్థి
రాయికల్: మండలంలోని అల్లీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సంకీర్తన రాష్ట్రస్థాయి కబడ్డీ (సబ్ జూనియర్) పోటీలకు ఎంపికై నట్లు పీడీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చి.. వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సంకీర్తనను హెచ్‌ఎం కిరణ్‌కుమార్, సర్పంచ్ ఎంబారి గౌతమి అభినందించారు.
ఓటు చోరీ పార్టీ కాంగ్రెసే..
జగిత్యాల: అసలైన ఓటు చోరీ పార్టీ కాంగ్రెస్ అని, అబద్దాల ప్రచారంలో ఆ పార్టీ అందెవేసిన చేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఓటు ప్రమాదంలో పడిందంటూ.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సోనియా వివాహమైన 16 ఏళ్ల వరకు భారత పౌరసత్వం తీసుకోలేదని, అయినా 1983లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసి చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. బీజేపీ ఓటు చోరీకి పాల్పడితే వాజ్‌పేయి ఒక ఓటు తేడాతో ప్రధానమంత్రి పీఠాన్ని వదులుకునే వారు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు రేషన్‌కార్డులు ఇచ్చి ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకుగా మలుచుకుందన్నారు. సర్ జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అశోక్, రమేశ్, దివాకర్, సత్యం, మమత, అశోక్, కాశెట్టి తిరుపతి, ఆముదరాజు, కవిత పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ చైతన్యానికి, ప్రజా ఉద్యమాలకు ఖిల్లా.. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న జిల్లా. అభివృద్ధి చేస్తే భారతదేశ పటంలో మరింత వెలుగొందనుంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా పలు ప్రధాన సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. పరిష్కరిస్తామన్న మాటలు తప్పా.. చేతల్లో కనిపించని అభివృద్ధి. ముఖ్యంగా.. కరీంనగర్‌లోని డంప్‌యార్డు ఏళ్లకాలంగా కంపు కొడుతుండగా, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఇంకా విమానం ఎగురుతుందని ఆశలు పెట్టుకున్నారు. జగిత్యాలలో నిజాం షుగర్ ఫ్యాక్టరీపై తీపి కబురు కోసం ఎదురుచూస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యమానేరు, రాజన్న ఆలయం, మరమగ్గాల సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి నేడు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏళ్లుగా వేధిస్తున్న ప్రజాసమస్యలకు మోక్షం లభిస్తుందని ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
● జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఉన్న నిజాంషుగర్ ఫ్యాక్టరీ 12ఏళ్ల క్రితం మూతపడింది. వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు, చెరుకు పండించే రైతులకు మార్కెటింగ్ కల్పించేందుకు ఈ షుగర్‌ఫ్యాక్టరీ దోహదం చేసింది. షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో వేలాదిమంది ఉపాధిపై ప్రభావం పడింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీని తెరిపించాలనే డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన షుగర్‌ఫ్యాక్టరీ అధ్యయనానికి కమిటీ వేశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి.
● గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరుకు చేరాయి. మధ్యమానేరు నుంచి గంభీరావుపేట మండలం ఎగువ మానేరు జలాశయానికి చేర్చాల్సి ఉంది. ఇందు కోసం ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ వద్ద 3 టీఎంసీలతో రిజర్వాయర్ పూర్తయింది. కాల్వల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ప్యాకేజీ–10, 11, 12 పూర్తికాగా 9వ ప్యాకేజీ పనులు మధ్యలో వదిలేశారు. గోదావరి జలాలతో నర్మాల ఎగువ మానేరు, నిమ్మపల్లి మూలవాగు, ఎల్లారెడ్డిపేట సింగసముద్రం, జిల్లెల్ల నక్కవాగు, రుద్రంగి సూరమ్మ చెరువు నిండితే 2లక్షల ఎకరాలు సేద్యం అవుతాయి.
● దక్షిణ కాాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఆలయ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. చెరువులో పార్కును అభివృద్ధి చేశారు. మూలవాగుపై రెండో వంతెన నిర్మాణం తుది దశకు చేరింది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో ఆలయ అభివృద్ధి సాగుతుండగా మరిన్ని నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యమానేరు బ్యాక్ వాటర్‌లో బోటింగ్, టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.
● సిరిసిల్లలో మరమగ్గాల పరిశ్రమ వేళ్లూనుకుని ఉంది. మగ్గాలను ఆధునీకరించి, డయింగ్ పరిశ్రమకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తే.. పరిశ్రమ అభివృద్ధికి అడుగులు పడతాయి. నేత కార్మికులను ఓనర్లుగా మార్చే ‘వర్కర్ టూ ఓనర్’ పథకానికి షెడ్లను నిర్మించారు. సాంచాలు ఏర్పాటు చేయలేదు. ఆ షెడ్లలో గోదాములుగా ధాన్యంతో నింపేశారు. ఇందిరా మహిళా శక్తి చీరలు, ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో బడా వ్యాపారులే బాగుపడుతున్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు, శ్రమించే కార్మికులకు బీమా సదుపాయం, హెల్త్ కార్డులు, పొదుపు పథకాలు, నూలు రాయితీ వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది.
రోడ్డు కోసం బురదలో బైఠాయించి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్నెగూడెం వచ్చిన ఆది శ్రీనివాస్..
తాను గెలిస్తే వంద రోజుల్లో మన్నెగూడెం– తక్కళ్లపల్లికి తారు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పడు వెయ్యి రోజులైనా మాట నెలబెట్టుకోలేదని పేర్కొంటూ మన్నెగూడెం యువకులు మంగళవారం రోడ్డుపై ఉన్న బురదలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఇకనుంచి ప్రతినెలా 29వ తేదీన శ్రీనివాస్ తరహాలోనే నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మూడు మండలాలకు ప్రధాన రోడ్డు అయిన మన్నెగూడెం – తక్కళ్లపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టేవరకు దీక్ష చేపడతామన్నారు. సీహెచ్.కరుణాకర్ రావు, తొట్ల మహేష్, బండి ప్రదీప్, కై రంకొండ ప్రసాద్, వెంకటేష్, ఎస్.భిక్షపతి, జె.రమేశ్, రాకేశ్‌రావు,
అందె సాయి తదితరులు పాల్గొన్నారు. – మేడిపల్లి
● రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వేలైన్ పూర్తయితే ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. సిరిసిల్ల–సిద్దిపేట– జనగామ, కరీంనగర్– కామారెడ్డి– పిట్లం జాతీయ రహదారులు విస్తరణ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. 15 పడకల బీడీ కార్మికుల ఈఎస్‌ఐ ఆస్పత్రి భవన నిర్మాణం కాలేదు. మహిళా డిగ్రీ కాలేజీ లేదు. మెడికల్ కాలేజీకి హాస్టల్ వసతి లేక.. వైద్యవిద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మెడికల్ కాలేజీకి మార్చాలి. చంద్రంపేట, రగుడ శివారులోని ఇండస్ట్రీయల్ జోన్‌ను ఎత్తివేయాలి. వేములవాడ మూలవాగుపై మామిడిపల్లి, బావుసాయిపేట, వట్టిమల్ల వద్ద వంతెనలను నిర్మించాల్సి ఉంది.
జేఎన్టీయూలో
కేరీర్ గైడెన్స్
కొడిమ్యాల: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఐటీ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని ఏటోస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కోచ్ గుమ్మడవెల్లి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని నాచుపల్లి జేఎన్‌టీయూలో శ్రీఏఐ యుగంలో ఐటీ కెరీర్‌కు సిద్ధం కావడంశ్రీపై కెరీర్ గైడెన్స్ నిర్వహించారు. విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. పరిశ్రమలకు చేకూరే ప్రయోజనాలను వివరించేలా ప్రాజెక్టులు రూపొందించాలని తెలిపారు. స్టేజ్‌ఫియర్‌ను అధిగమించడం, ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కోవడం, ప్రొఫెషనల్ వేదికలను సద్వినియోగం చేసుకోవడంపై పలు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ జి.నరసింహ మాట్లాడుతూ నిపుణుల సూచనలు పాటిస్తూ విద్యార్థులు కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీనివాసరావును ప్రిన్సిపాల్, విభాగాధిపతులు సన్మానించారు. వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సర్వే వేగవంతం చేయాలి
ఇబ్రహీంపట్నం: రైతులు సాగు చే స్తున్న పంట లను పరిశీ లించి నమో దు చేయాలని డీఏవో భాస్కర్ సూచించారు. మండలకేంద్రంలో చేపడుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను మంగళవారం పరిశీలించారు. రైతులు ఏయే పంటలు పండిస్తున్నారు.. వంటి వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఏవో రాజ్ కుమార్, ఏఈఓ వినోద్ పాల్గొన్నారు.
వాసాల శ్రీధర్
శశికాంత్‌రెడ్డి
రమేశ్
కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి
జగిత్యాలరూరల్: వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని అడిషనల్ డీఆర్డీవో సునీత అన్నారు. సారంగాపూర్ మండల జాగృతి మండల సమైక్య సమావేశ మందిరంలో సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల మార్కెటింగ్ సభ్యులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. కొనుగోళ్లు సజావుగా చేపట్టేలా ఎఫ్‌ఏక్యూ ప్రకారం కొనుగోళ్లు చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో డీపీఎం రమేశ్, ఏపీఎం, సీసీలు, సీఆర్పీలు, ఎంఎస్‌లు పాల్గొన్నారు.
జగిత్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శశికాంత్‌రెడ్డి, జనరల్ సెక్రటరీగా చింత రమేశ్, కోశాధికారిగా వాసాల శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఎంఏ హాల్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో అందరూ ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. వీరి ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.


