పుష్కర పనులకు అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

పుష్కర పనులకు అడ్డంకులు

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● ప్రభుత్వ ధరకు భూములివ్వబోమన్న రైతులు ● భూసేకరణకు వెళ్లిన అధికారులకు చుక్కెదురు

వెల్గటూర్‌గోదావరి పుష్కరాల సందర్భంగా కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయం నుంచి పాశిగామ బస్‌స్టాప్‌ వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4కోట్లు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణానికి అధికారులు గతంలో రెండుసార్లు భూసేకరణకు సర్వే కోసం రాగా రైతులు అడ్డుకున్నారు. మంగళవారం మరోసారి అధికారులు సర్వేకు రాగా కోటిలింగాల వై జంక్షన్‌ వద్ద రైతులు వారిని అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణంలో గుంటకు రూ.లక్షలాది విలువ చేసే భూములు కోల్పోతామని, ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని, నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. టెండర్‌ గడువు త్వరలో ముగియనుందని, రైతులకు నచ్చజెప్పి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ లక్ష్మణరావు, పీఆర్‌ ఏఈ రాజు, తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో వెంకట్‌ ప్రసాద్‌, సీఐ రాంనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement