గురుకులం విద్యార్థుల భద్రతపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

గురుకులం విద్యార్థుల భద్రతపై దృష్టి

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

రాయికల్‌: గురుకులం విద్యార్థుల సౌకర్యాలు, భద్రతపై దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. మండలంలోని జగన్నాథపూర్‌, ఒడ్డెలింగాపూర్‌ గ్రామాల్లోని గురుకులాలను మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాఠశాలల నిర్వహణ, ఆహారం, పారిశుధ్యం, వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చలికాలం వస్తున్నందున స్నానాలకు వెచ్చని నీరు, దుప్పట్లు, ఇతర వసతులు ముందుగానే సమకూర్చాలని సూచించారు. ఉప్పుమడుగులో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్‌ భవనాన్ని పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్‌, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి నరేశ్‌, డీఈవో రాము, తహసీల్దార్‌ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

జగిత్యాల: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రానీయొద్దని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ధర్మపురి, కోటిలింగాలు, వెల్గటూర్‌, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, బీర్‌పూర్‌, రాయికల్‌ మండలాల పరిధిలోని గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కరఘాట్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2.40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, పుష్కర ఏర్పాట్లకు రూ.220.41 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. భక్తులకు నిరంతర తాగునీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement