తెలియకుండా స్థలం అమ్మారు | - | Sakshi
Sakshi News home page

తెలియకుండా స్థలం అమ్మారు

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

మేము కోరుట్ల పట్టణంలోని మేరు సంఘం సభ్యులం. మా సంఘంలో ఆరుగురు సభ్యులు సంఘ భవనంలోని 40 గజాల స్థలాన్ని నర్సయ్య అనే వ్యక్తికి అమ్మారు. సంఘం సభ్యులంతా వ్యతిరేకించినా.. ఎలాంటి సంతకాలు చేయకున్నా విక్రయించారు. ఆ స్థలంలో ఇప్పుడు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. భవన నిర్మాణం నిలి పివేయండి. – మేరు సంఘం సభ్యులు, కోరుట్ల

ప్రభుత్వ భూమిని రక్షించండి

ఇబ్రహీంపట్నం మండలంలో ఎస్సారెస్పీ ముంపు గ్రామమైన బర్దిపూర్‌లో సర్వే నంబరు 376లోని ప్రభుత్వ భూమి మొత్తం విస్తీర్ణం 9.19 ఎకరాలు ఉంది. అందులో 376/2గా చూపుతున్న 5.13 ఎకరాలకు సంబంధించిన బీ–1 ఫారం పట్టా నకిలీ అక్రమమైనవని తెలుస్తోంది. సమగ్ర విచా రణ జరిపి ప్రభుత్వ భూమిని రక్షించాలి. ఆ భూ మిని శ్మశానం, ఖబ్రస్థాన్‌ అవసరాలకు కేటాయించాలి. – బర్దీపూర్‌ గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement