రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఏకగ్రీవం

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

జగిత్యాలజోన్‌: జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యవర్గం ఏకగ్రీవమైనట్లు సొసైటీ ఎన్నికల అధికారి, డీసీవో సీహెచ్‌.మనోజ్‌కుమార్‌ తెలిపారు. అధ్యక్షుడిగా ఆకుతోట శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బి.ఉమాదేవి, కోశాధికారిగా పి.నరేందర్‌ గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సిరిసిల్ల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధాన ఆయుధం

జగిత్యాల: ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధాన ఆయుధమని, అలాంటి ఓటను ‘సర్‌’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ తొలగించే కుట్ర చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో సమగ్ర ఓటరు నమోదుకు అనుగుణంగా అప్పుడు నమోదు చేసుకున్న వారికి ఇప్పుడు సర్‌ ప్రక్రియలో ధ్రువపత్రాలు అందించినా మళ్లీ నోటీసులు రావడం విడ్డూరంగా ఉందన్నారు. బీఎల్వోలకు సరైన పత్రాలు అందించినా.. నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. అధికార బీజేపీతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ కుమ్మకై ్కందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా పద్ధతి మార్చుకోవాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, గ్రంథాలయ చైర్మన్‌ దినేశ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, నాయకులు కృష్ణారావు, బండ శంకర్‌, గంగారెడ్డి పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు లక్ష్మీపూర్‌ విద్యార్థులు

జగిత్యాలరూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌ జెడ్పీ పాఠశాల విద్యార్థులు అల్లె సహస్ర, అల్లె వేదాన్ష్‌ జాతీయస్థాయి అత్యపత్య పోటీలకు ఎంపికై నట్లు పీడీ మల్లేశ్వరి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వీరు వచ్చేనెల రెండో తేదీ నుంచి హైదరాబాద్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను సర్పంచ్‌ నల్ల కవిత, స్వామిరెడ్డి, హెచ్‌ఎం విజయ, గ్రామస్తులు అభినందించారు.

నిమజ్జనంలో సేవలు అభినందనీయం

జగిత్యాలక్రైం: మూడు రోజులపాటు కొనసాగిన గ ణేశ్‌ నిమజ్జనంలో అవాంఛనీయ సంఘటనలకు తా వులేకుండా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నారు. బందోబస్తులో పా ల్గొన్న ట్రాన్స్‌జెండర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, వాల్మీ కీ ఆవాసం విద్యార్థులకు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రశంస పత్రాలు అందించారు. నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీస్‌ సిబ్బందితో సమన్వయంతో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు ఆసక్తి చూపిస్తే.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఏఎస్పీ చేతన్‌ నితిన్‌, సీఐలు కరుణాకర్‌, ఆరిఫ్‌ అలీఖాన్‌, వేణు, ఎస్సైలు కుమారస్వామి, మహేశ్‌, సుప్రియ, సుబ్రహ్మణ్యం, సంపూర్ణాచారి, 9వ బెటాలియన్‌ ఎన్‌సీసీ అధికారులు రాజు, ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాల ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ కె. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

బాధితుల సమస్యల పరిష్కరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీ వెన్స్‌లో 14 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement