ధర్మపురి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకునికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యాలయం నుంచి పురవీధుల మీదుగా శోభాయాత్రను కనులపండువగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం వినాయకుడిని గోదావరిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుబాయ్‌లో వినాయక నిమజ్జనం
జగిత్యాలరూరల్: దుబాయ్‌లో హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం.. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలీ, ధర్మాజి సత్తన్న, జంబర్తి గంగాధర్, కో–ఆర్డినేటర్ రమేష్, కరుణాకర్ పాల్గొన్నారు.
భారీ వర్షానికి నేలకొరిగిన మక్క
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్, అర్బన్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. పంట చేతికందే సమయంలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పీఆర్సీపై నాన్చివేత ధోరణి తగదు
జగిత్యాలజోన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి సరికాదని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవచూపకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఉద్యోగులకు ఆరు డీఏలు ఇవ్వాలని సూచించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. డీఎస్సీ–2003 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 317 జీవోతో ఇతర జిల్లాలకు బదిలీ అయిన భార్యాభర్తలైన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ట్రెజరీ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘం నాయకుడు రోట్టె శ్రీనివాస్ యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాతూరి రాజిరెడ్డి, చంద్రశేఖర్‌రావు, తిరుపతి రెడ్డి,వేణుగోపాల్‌రావు, శ్రీనివాస్, కిషన్, శ్రీధర్, హరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.


