సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

బుగ్గారం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కార్యకర్తలకు సూచించారు. మండలంలోని శెకెల్ల, బుగ్గారం గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శెకెల్లలో ఇటీవల ఎన్నికై న కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షులకు నియామక పత్రాలు అందించారు. సర్పంచ్‌ పర్స రమేశ్‌ చొరవతో ఏర్పాటు చేసిన హనుమాన్‌ ఆలయంలో రేకుల షెడ్డును ప్రారంభించారు. వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.15.54లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో సజీరారహీముద్దీన్‌ గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దినేష్‌, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచులు నక్క రాజవ్వ, నాయకులు వేముల సుభాష్‌, నర్సాగౌడ్‌, బాదినేని రాజేందర్‌, సుధీర్‌ సింగ్‌, తన్నీరు హరీశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement