కోరుట్ల: తల్లిదండ్రులు తమ పిల్లలు అథ్లెటిక్స్ వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యరద్శి ఎలేటి ముత్తయ్యరెడ్డి అన్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ప్రారంభించారు. ముత్తయ్యరెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీల్లో సుమారు 460 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులు ఈనెల 26, 27ల్లో హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. 14 నుంచి 20 ఏళ్ల బాలబాలికలకు 60, 100, 200, 400, 600, 800, 1000 మీటర్ల రన్నింగ్ పోటీలు, లాంగ్ జంప్, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో పోటీలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడా ఉపాధ్యాయుడు, కోశాధికారి బి.కొమురయ్య, రాజేశ్, సీహెచ్ శంకర్, సాగర్, వినోద్, ఎం.రాజు, కార్తీక్, శ్రీలత, జగిత్యాల జిల్లా వ్యాయామ సంఘం అధ్యక్షుడు నవీన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


