రైలుకింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

● కేసు భయంతో అఘాయిత్యం

బీసీ గురుకులం నుంచి ఇంటికి విద్యార్థి

హుజూరాబాద్‌: పట్టణంలోని బోర్నపల్లి రోడ్డులో ఉన్న వీణవంక మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులం నుంచి ఆదివారం ఆరో తరగతి విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపింది. వీణవంక మండలంలోని గన్ముక్కులకు చెందిన బొంగోని స్నితన్‌ నెలరోజుల క్రితం గురుకులంలో చేరాడు. హాస్టల్‌ వాతావరణానికి అలవాటు పడలేక ఆదివారం ఉద యం 5.30 గంటలకు పాఠశాల నుంచి బయటకు వెళ్లి, వాహనదారులను లిఫ్ట్‌ అడుగుతూ స్వగ్రామానికి బయలుదేరాడు. విద్యార్థి కనిపించకపోవడంతో సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వీణవంక వద్ద బాలుడు కనిపించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలకు సరైన ప్రహరీ గోడ లేకపోవడంతోనే విద్యార్థి బయటకు వెళ్లగలిగాడని ప్రిన్సిపాల్‌ సంపత్‌ తెలిపారు.

వెల్గటూర్‌/మంచిర్యాల కై ం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్‌కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్‌ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో గుల్లకోట గ్రామానికి చెంది.. జయశంకర్‌భూపాలపల్లిలో వీఆర్‌వోగా పనిచేసిన మల్లేశ్‌ తోడళ్లుడు రమేశ్‌ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లికి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్‌ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీకొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. కొద్దిరోజులుగా వారు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్‌కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీకొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో నివాసముంటున్న మల్లేశ్‌ సోదరుడు శ్రీనివాస్‌ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ సమీపంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement