లలిత కళా సమితి స్థలం.. వివాదం | - | Sakshi
Sakshi News home page

లలిత కళా సమితి స్థలం.. వివాదం

Sep 3 2026 4:15 AM | Updated on Sep 3 2026 4:15 AM

● నిరుపయోగంగా ఉందని ఫిర్యాదులు ● వెనక్కి తీసుకోవాలంటున్న మహిళలు ● మహిళా సంఘం భవనానికి కేటాయించాలని విజ్ఞప్తి ● కళలు, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లలిత కళా సమితికి 1981లో అప్పటి ప్రభుత్వం.. ప్రస్తుతం బల్దియాలోని 12వార్డులో విలీనమైన వెంకట్రావ్‌పేటలోని సర్వే నెంబర్‌ 305లో 19గుంటలు కేటాయించింది. ● ఇందులోని సుమారు రెండు గుంటల స్థలంలో కమర్షియల్‌ భవనాన్ని నిర్మించారు. మిగతా స్థలాన్ని అప్పటి నుంచి ఖాళీగానే వదిలేశారు. ● ఆ వార్డులో ఎక్కడా ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతోపాటు కళాసమితికి ఇచ్చిన భూమిలో ఎక్కువ భాగం దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంటుండడంతో దానిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఆ స్థలంలో కొంతభాగాన్ని తమ సంఘం భవనంతో పాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి కేటాయించాలని స్థానిక మహిళలు పట్టుబడుతున్నారు. ● సోమవారం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి తర్వాత ఆర్డీవో నర్సింహారావుకు వినతిపత్రం అందించారు. మంగళవారం తహసీల్దార్‌ ముఫ్తార్‌పాషాను కలిసి తమ సమస్యను వివరించారు. ● మరోవైపు సమితికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని మహిళలు తమ సంఘం భవనానికి కేటాయించాలని ఆందోళనకు దిగడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ● లలిత కళా సమితి స్థలాన్ని తమ సంఘానికి కేటాయించాలంటూ మహిళలు.. తమ స్థలాన్ని ఇతరులు ఆక్రమించకుండా చూడాలంటూ సమితి సభ్యులు వేర్వేరుగా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా అసక్తి నెలకొంది.

మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని 12వార్డులో లలిత కళా సమితికి చెందిన స్థలం కోసం స్థానిక మహిళలు ఆందోళనలు చేస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల క్రితం సమితికి కేటాయించిన భూమిలో ఖాళీగా ఉన్న దానిలో కొంతభాగాన్ని మహిళా సంఘం భవనానికి కేటాయించాలంటూ వారు పట్టుబట్టుతున్నారు. వినియోగంలో లేని స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తుండడం వివాదానికి దారి తీసింది.

1981లో 19గుంటలు కేటాయింపు..

అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement