వార్డుల్లో తిరగని వాహనాలు చెత్త సేకరించినట్లు రికార్డులు జగిత్యాల బల్దియాలో చిత్రవిచిత్రాలు డీజిల్ కుంభకోణంపై కౌన్సిలర్ల ఫిర్యాదు తాజాగా పట్టుబడిన ఇద్దరు ఔట్‌సోర్సింగ్ డ్రైర్లు
వాహనాల మరమ్మతు పేరిట నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పారిశుధ్య వాహనాల కోసం బల్దియా మెకానిక్‌ను నియమించినా.. చిన్నచిన్న రిపేర్లకు కూడా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రూ.9లక్షలు వెచ్చించి వాహనాలకు జియోట్యాగింగ్ ఏర్పాటు చేసినా.. అది కొన్ని వాహనాలకే పరిమితమైంది. బల్దియాలో 50వార్డులున్నాయి. చెత్త సేకరణకు 64 వాహనాలున్నాయి. ఈ వాహనాలకు వినియోగించే డీజిల్ బిల్లులు ఏకంగా రూ.లక్షలు దాటుతోందని కౌన్సిలర్లు చెబుతున్నారు.
కొందరికే బయోమెట్రిక్
మున్సిపల్ కార్మికులు కొందరికే బయోమెట్రిక్ హాజరు ఉందని, అందరికీ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ కార్మికుల నియామకంలో అనేక అవకతవకలు వెలుగుచూసినా అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. జగిత్యాల మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేరాఫ్‌గా మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కమిషనర్లుగా పనిచేసిన వారు ఒత్తిడి తట్టుకోలేక బదిలీపై వెళ్లిపోయిన ఘటనలున్నాయి.
ఇద్దరు ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లపై కేసు నమోదు
జగిత్యాలక్రైం: చెత్త సేకరించే వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేసిన ఇద్దరు ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై మహేశ్ తెలిపా రు. చెత్త వాహనాల నుంచి కొద్ది రోజు లుగా ఇంధనం దొంగతనం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసిన వాహనాల నుంచి ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు బొమ్మెన అనిల్‌కుమార్, కట్కూరి నాగరాజు డీజిల్ తీస్తుండగా శానిటేషన్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని విచారణ చేపట్టగా.. ఇప్పటివరకు రూ.10 వేల విలువైన 83 లీటర్ల ఇంధనాన్ని చోరీ చేసినట్లు అంగీకరించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ దోనాల కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
294
జగిత్యాల: జగిత్యాల బల్దియాలో మళ్లీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పలు శాఖల్లో అవినీతి పెచ్చుమీరుతోందని సాక్షాత్తు కౌన్సిలర్లే పేర్కొంటున్నారు. గతంలో మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు సంబంధించిన డీజిల్ వ్యవహారంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. వాహనాలు వార్డుల్లో తిరగకున్నా తిరిగినట్లు.. చెత్త సేకరించినట్లు రికార్డుల్లో రాశారు. అధికారులపై విచారణ చేపట్టినప్పటికీ ఎవరిపైనా వేటు వేయలేదు. ఈ క్రమంలోనే డీజిల్ వ్యవహారంలో కుంభకోణం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జూలైలో డీజిల్ కోసం రూ.11,83,630 ఖర్చు చేసినట్లు బిల్లులు రాశారు. వాస్తవంగా జూలై ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టలేదు. అయినా జూన్‌తోతో పోల్చితే
రూ.2లక్షల బిల్లు పెరిగిందని అంటున్నారు.


