మెట్‌పల్లి: పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రుల అనుమతులు, వైద్యుల అర్హత ప్రతాలను పరిశీలించారు. సూర్య ఆసుపత్రిలో అర్హత లేని వైద్యుడితో ఈఎన్‌టీ పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు తనిఖీలు జరిపి ప్రాథమికంగా గుర్తించిన అంశాల ఆధారంగా నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆస్పత్రి నిర్వహణ విషయంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట మండల వైద్యాధికారి జైపాల్‌రెడ్డి ఉన్నారు.
విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు
కోరుట్ల: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నామని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఎక్కువగా చూడడం ద్వారా చూపుపై ప్రభావం పడుతుందన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. హెచ్‌ఎం గంగాధర్, హెల్త్ ఎడ్యూకేటర్ జక్కని ధనుంజయ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


