పింఛన్ కోసం అర్హులు పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల్లో భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్కో గ్రామం నుంచి 200కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వృద్ధాప్య పింఛన్ ఆప్షన్ లేకున్నా.. దరఖాస్తు మాత్రం తీసుకుంటున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులకు లాగిన్ ఐడీ ఇచ్చారు.
కొత్త నిబంధనలు
దివ్యాంగులకు కొత్త సమస్య
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ గడువు సమస్య త లెత్తుతోంది. వారు సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు కొంత గడువును మాత్రమే నిర్దేశిస్తున్నారు. కాళ్లు, ఇతరత్రా సమస్యలపై శాశ్వత సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే సర్టిఫికెట్ గడువు తీరిందని చెబుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. వారు మళ్లీ సదరం క్యాంపునకు వెళ్లి వికలాంగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. అప్పటివరకు దరఖాస్తు గడువు ముగుస్తుందని ఆందోళన చెందుతున్నారు.
జగిత్యాలరూరల్: ఆసరా పింఛన్ పథకం కింద ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయబోతోంది. అర్హులు ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే దరఖాస్తు ఫారంలో వృద్ధాప్య పెన్షన్ ఆప్షన్ ఎక్కడా లేదు. అయినప్పటికీ వృద్ధులు దరఖాస్తు చేసుకుంటే తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చినా.. పింఛన్ మంజూరుకు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలని, అన్నికోణాల్లో కుటుంబం వివరాలను సేకరించాలని అందులో ఉంది. ఈ లెక్కన చాలామంది పింఛన్‌కు అనర్హులుగా తేలు తారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పూర్తి విచారణ తర్వాతే
చేయూత పింఛన్ కోసం వచ్చే దరఖాస్తులపై ఎంపీడీవోలు, ఇతర అధికారులు సమగ్రంగా విచారిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల కుటుంబాల వివరాలను క్రోడీకరించి, అర్హులకే పింఛన్లు మంజూరు చేస్తాం. ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. గతంలో ఉన్నవే.
– రఘువరణ్, డీఆర్డీఏ పీడీ


