కొండగట్టులో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

కొండగట్టులో భక్తుల రద్దీ

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ బసవ రెడ్డి కు టుంబ సమేతంగా పూజలు చేశారు. ఆలయం అర్చకులు వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలలో 69 వైద్య అధ్యాపక పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. జీవో 1276 ప్రకారం కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమకాలు ఉంటాయని, 11 ప్రొఫెసర్‌, 29 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 29 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయని, అర్హులు ఈనెల 24న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 10 నుంచి 5గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు, అనుభవం, విద్యార్హతల పత్రాలతో రావాలన్నారు. పోస్టుల వారీగా అర్హతలు, ఎంపిక విధానం, వెబ్‌సైట్‌ JAGTIALTELA NGANA.GOV.INలో పరిశీలించుకోవాలని తెలిపారు.

రైతు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా కరుణాకర్‌రెడ్డి

పెగడపల్లి: జాతీయ రైతు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని నామాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ ఇనుగండ్ల కరుణాకర్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

22ఏ భూములపై విచారణ చేపట్టండి

జగిత్యాలటౌన్‌: 22ఏలో అక్రమంగా చేర్పులు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు కలెక్టరేట్‌లో శనివారం వినతిపత్రం అందించారు. 22ఏ భూముల వివరాలను గ్రామం, మండలం, సర్వేనంబర్‌ వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని, గతంలో ఉన్న భూములు, కొత్తగా చేర్చిన, తొలగించిన వాటి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ ఉత్తర్వుల ఆధారంగా భూములను 22ఏలో చేర్చారో వెల్లడించాలన్నారు. ధరణి/భూ భారతి డిజిటల్‌ రికార్డుల్లో 22ఏకు సంబంధించిన మార్పులపై ఫొరెన్సిక్‌ పరిశీలన చేపట్టాలన్నారు. 22ఏ భూముల జాబితాలో జరిగిన తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు నలువాల తిరుపతి, ఓరుగంటి చంద్రశేఖర్‌, సుంకేటి దశరథారెడ్డి, జంబర్తి దివాకర్‌, కస్తూరి సత్యం, రాగిళ్ళ సత్యనారాయణ పాల్గొన్నారు.

‘పీఎం కుసుమ్‌’తో ఆదాయం

మెట్‌పల్లిరూరల్‌: పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సోలార్‌ ప్లాంట్ల ద్వారా రైతులు 25ఏళ్లపాటు ఏటా స్థిరమైన ఆదాయం ఆర్జించవచ్చని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. మెట్‌పల్లి మండలం చౌలమద్ది శివారులో ఒక మెగావాట్‌ పీఎం కుసుమ్‌ సోలార్‌ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. సమీపంలోని సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ రైతులను వ్యవస్థాపకులుగా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ భూముల్లో సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవడానికి పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి గ్రీడ్‌కు అనుసంధానించామని పేర్కొన్నారు. రెడ్కో జిల్లా మేనేజర్‌ మనోహర్‌, డిస్కం డీఈలు మధుసూదన్‌, గంగారాం, శ్రీనివాస్‌, ఏడీఈలు రవి, శ్రీధర్‌, వెంకటేశ్వర్లు, ఏఈలు రమేశ్‌, శ్రీనివాస్‌, జ్యోతి, ప్లాంట్‌ యాజమాని నర్సింహరెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement