మహిళా సంఘాల బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాల బలోపేతానికి కృషి

Aug 19 2026 1:06 AM | Updated on Aug 19 2026 1:06 AM

జగిత్యాలరూరల్‌: మహిళాసంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం నర్సింగాపూర్‌లో రూ.10 లక్షలతో నిర్మించే శ్రీలక్ష్మీ మహిళాసమైక్య భవన నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు. పావలావడ్డీతో ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వంశీ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, తహసీల్దార్‌ హకీం, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, ఏఈ విజయ్‌, ఏపీఎం రాజ య్య, నాయకులు బాలముకుందం, మల్లారెడ్డి, నరేశ్‌, లక్ష్మణ్‌, రాజనర్సయ్య, మహిళ సంఘ నాయకులు దివ్య, భాగ్య, లక్ష్మీ, పద్మ, గ డ్డం లక్ష్మీ పాల్గొన్నారు.

వసతులు కల్పించాలి

జగిత్యాల: నూకపల్లి అర్బన్‌ కాలనీలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్త తొలగించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, హౌసింగ్‌ డీఈ భాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సత్యప్రణవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement