భారం తగ్గించుకుంటున్న బ్యాంకర్లు
ప్రజలకు ఇంటర్‌నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ ఫోన్లతోనే బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు దొరికింది. బ్యాంకులు కూడా తమ యాప్‌లతోపాటు మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటితోపాటు ఫోన్‌పే, గుగూల్ పే వంటివి కూడా అందుబాటులోకొచ్చాయి.
ఆరుమార్గాల ద్వారా..
బ్యాంకులు ఆరుమార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. మొదటిది భీమ్ లేదా యూపీఐ. బ్యాంకు యాప్‌లతోపాటు ఫోన్ పే, గుగూల్ పే వంటి యాప్‌ల ద్వారా ఒకరి బ్యాంకు అకౌంట్ నుంచి మరొకరి బ్యాంక్ అకౌంట్‌కు మాత్రమే డబ్బులు పంపవచ్చు. రెండోది..భీమ్/ఆధార్.. ఆధార్ నంబర్, బోటన వేలిముద్ర ద్వారా వినియోగదారుల సేవా కేంద్రాల్లో డబ్బులు తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి వోచర్లు రాయనవసరం లేదు. మూడోది.. భారత్ క్యూఆర్ కోడ్. ఫోన్‌పే, గుగూల్ పే వంటి బ్యాంకు క్యూఆర్ కోడ్‌లను ఫోన్‌తో స్కానింగ్ చేయడం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ పద్ధతి ప్రతి దుకాణాల్లో కనబడుతుంది. నాలుగోది.. ఐఎంపీఎస్ ఫోన్‌పే, గుగూల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా మొబైల్ నంబర్‌తో డిజిటల్ లావాదేవీలు నిర్వహించవచ్చు. డబ్బు పంపించే వ్యక్తితోపాటు డబ్బులు తీసుకునే వ్యక్తి ఫోన్‌పే, డిజిటల్ యాప్ ఉండాల్సి ఉంటుంది. ఐదోది.. డెబిట్(ఎటి ఎం కార్డు), క్రెడిట్ కార్డ్స్‌లను స్వైప్ మిషన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు. ఆరోది..యుఎస్‌ఎస్‌డీ పద్ధతిలో ఎస్‌ఎంఎస్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రస్తుతం పెద్దగా ఆచరించడం లేదు.
జిల్లాలో డిజిటల్ లావాదేవీల పరిస్థితి ఇలా..
జిల్లాలో 12 ప్రభుత్వ, 20 ప్రైవేట్, ఎనిమిది స్మాల్ ఫైనాన్స్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సహకార బ్యాంకు కొనసాగుతున్నాయి. తమ శాఖల ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు, మొదటి క్వార్టర్‌లో రూ. 21,439.55 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇందులో బీమ్/యూపీఐ ద్వారా రూ.11,854.68 కోట్లు, ఆధార్ ద్వారా రూ.12.98 కోట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా రూ.4.51 కోట్లు, ఐఎంపీఎస్ ద్వారా రూ.9,352.54 కోట్లు, ఎటీఎం కార్డ్స్ ద్వారా రూ. 208.94 కోట్లు, యూఎస్‌ఎస్‌డీ ద్వారా రూ. 5.9కోట్ల నగదు రహిత లావాదేవీలు జరిగాయి.
ప్రజలకు సేవలు.. యాప్‌లకు కమీషన్
ఫోన్‌పే, గుగూల్ పే వంటి సంస్థలు స్వచ్ఛందగా ప్రజలకు సేవలు అందించవు. ప్రజలకు బ్యాంకు సేవలు అందించినందుకు ఆయా బ్యాంకులు పేమెంట్ సంస్థలకు కమీషన్ చెల్లిస్తుంటాయి. బ్యాంకులు కూడా యాప్‌ల ద్వారా నెట్ బ్యాకింగ్ సౌకర్యం కల్పిస్తున్నాయి. బ్యాంకు యాప్‌ల ద్వారా రోజుకు రూ.2లక్షల వరకు డిజిటల్ లావాదేవీలు నిర్వహించవచ్చు. ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే బ్యాంకులు ఆ సమస్యను పరిష్కరిస్తాయి. ఫోన్ పే, గుగూల్ పే ద్వారా రూ.లక్ష వరకే లావాదేవీలు నిర్వహించవచ్చు. వీటి ద్వారా ఏదైనా ఇబ్బంది అయితే ఆ సంస్థలే పరిష్కరించాల్సి ఉంటుంది.
జగిత్యాలఅగ్రికల్చర్: నిన్నామొన్నటి వరకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి డబ్బులు జమ చేయడం.. లేదా విత్‌డ్రా చేసుకునేవారు. కొన్నాళ్లుగా కేంద్రప్రభుత్వం డిజిటల్ లావాదేవీలకు పెద్దపీట వేస్తుండటం.. బ్యాంకులు కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తుండటంతో లావాదేవీల నిర్వహణ ప్రజలకు తేలికగా మారింది. ఈ మేరకు బ్యాంకు ఖాతాదారులు డిజిటల్ టెక్నాలజీతో 2026–27 మొదటి క్వార్టర్ (ఏప్రిల్ నుంచి జూన్)లో రూ.21,439.55 కోట్ల లావాదేవీలు జరిపారు. బ్యాంకు వేళలతో సంబంధం లేకుండా.. 24గంటలపాటు ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశం ఉండటంతో లావాదేవీలు తేలికగా మారాయి.


